కోహ్లి వికెట్‌ తీయడమే నా మొదటి ప్రాధాన్యత | Shoriful Islam Says I Take Virat Kohli Wicket Definitley Vs India T20 WC | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: కోహ్లి వికెట్‌ తీయడమే నా మొదటి ప్రాధాన్యత

Published Sun, Oct 3 2021 5:55 PM | Last Updated on Sun, Oct 3 2021 9:52 PM

Shoriful Islam Says I Take Virat Kohli Wicket Definitley Vs India T20 WC - Sakshi

Shoriful Islam Want To Take Virat Kohli Wicket.. టి20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌ ముగిసిన రెండు రోజులకే అక్టోబర్‌ 17 నుంచి ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. ఇక బంగ్లాదేశ్‌ జట్టు నేడు ఒమన్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో ఆడే అవకాశం వస్తే కోహ్లి వికెట్‌ తీయడమే నా మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నాడు.

కాగా షోరిఫుల్‌ ఇస్లామ్‌ మార్చి 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆరంభ సిరీస్‌లోనే 17.35 ఎకానమీ రేటుతో 17 వికెట్లు పడగొట్టి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శనతోనే ఇస్లామ్‌ ప్రపంచకప్‌లో పాల్గొనబోయే బంగ్లా టి20 జట్టులో చోటు దక్కించుకున్నాడు.  కాగా నేడు ఒమన్‌కు చేరుకోనున్న బంగ్లాదేశ్‌ ఒక్కరోజు మాత్రమే క్వారంటైన్‌లో గడపనుంది. అక్టోబర్‌ 5 నుంచి బంగ్లా ఒమన్‌లో తమ ప్రాక్టీస్‌ను ఆరంభించనుంది.

అక్టోబర్‌ 9న యూఏఈ చేరుకోనున్న బంగ్లాదేశ్‌ తొలుత క్వాలిఫై మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్‌ 12,14న శ్రీలంక, ఐర్లాండ్‌లతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఆడనున్న బంగ్లా అక్టోబర్‌ 19, 21న ఒమన్‌, పపువా న్యూ జినియాతో క్వాలిఫై మ్యాచ్‌లు ఆడనుంది. కాగా బంగ్లాదేశ్‌ సునాయాసంగానే సూపర్‌ 12 దశకు అర్హత సాధిస్తుందనిపిస్తుంది. ఇటీవలే ఆస్ట్రేలియను 4-1తో, న్యూజిలాండ్‌ను 3-2 తేడాతో సిరీస్‌లను గెలుచుకొని ఫామ్‌లో ఉంది.

చదవండి: Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ

Tiger Vs Liger: టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలో ఎవరిది విజయం..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
 
Advertisement