Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో శుబ్‌మన్ గిల్ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఆర్‌సీబీని ఇంటికి సాగనంపాడు. ఆదివారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గిల్ సెంచరీతో మెరిశాడు. 50 బంతుల్లోనే శతకం సాధించిన గిల్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. కాగా ఈ సీజన్‌లో గిల్‌కు ఇది రెండో శతకం అన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఓపెనర్‌గా వచ్చి ఆఖరిదాకా నిలబడి సెంచరీతో కదం తొక్కడమే గాక జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. పాపం ఈసారైన కప్ కొట్టాలని కలలు గన్న ఆర్‌సీబీకి పీడకలనే మిగిల్చాడు గిల్.
ఇక గిల్ శతకం ఈ సీజన్‌లో పదకొండోది కావడం విశేషం. ఒక సీజన్‌లో ఇన్ని శతకాలు నమోదు కావడం బహుశా ఇదే తొలిసారేమో. అంతేకాదు ఒకే మ్యాచ్‌లో ఇరుజట్ల నుంచి రెండు శతకాలు నమోదవ్వడం ఇది నాలుగోసారి. 23 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా గిల్ చరిత్రకెక్కాడు.
ఐపీఎల్ 2023లో గిల్‌ది పదకొండో శతకం. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ (100 పరుగులు), శుభమాన్ గిల్ (101 పరుగులు), ప్రబ్‌సిమ్రాన్ సింగ్ (103 పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు) , యశస్వి జైస్వాల్ (124 పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100* పరుగులు), కోహ్లి(101*)తో ఉన్నారు.
Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6
— IndianPremierLeague (@IPL) May 21, 2023
చదవండి: కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా
Comments
Please login to add a commentAdd a comment