శుబ్‌మన్ గిల్ (PC: IPL)
IPL 2023- Playoffs: ఐపీఎల్-2023లోనూ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన పాండ్యా సేన.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌ను ఘన విజయంతో ముగించింది. టాప్-4లో అడుగుపెట్టాలన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లుతూ అద్భుత విజయంతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.
కోహ్లి శతకం వృథా
సొంత మైదానంలో గుజరాత్ చేతిలో ఓడిన ఆర్సీబీ టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించగా.. పదో గెలుపు నమోదు చేసి తమకు తిరుగు లేదని నిరూపించుకుంది. కాగా బెంగళూరులో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఓపెనర్ విరాట్ కోహ్లి శుభారంభం అందించాడు.
అజేయ సెంచరీ(101)తో మెరిసి జట్టు 197 పరుగులు స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుని గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చి ఆర్సీబీని ఇంటికి పంపించాడు.
ముంబైకి లైన్ క్లియర్ చేశాడు కూడా!
అంతేకాదు.. ప్లే ఆఫ్స్ చేరాలన్న ముంబై ఇండియన్స్ ఆశలకు ఊపిరిలూదాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో గెలుపొందినప్పటికీ ముంబైకి ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు కాలేదు. మరుసటి మ్యాచ్‌లో ఆర్సీబీ గనుక గుజరాత్‌పై గెలిస్తే వాళ్లే టాప్-4కి చేరేవారు.
ముంబై కంటే నెట్ రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న కారణంగా ఆర్సీబీ మరో రెండు పాయింట్లు సాధిస్తే.. రోహిత్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది. అయితే, గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా.. ఆర్సీబీకి ఆరు వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. దీంతో ముంబైకి పోటీ లేకుండా పోయింది.
గిల్ ముంబై కోసం అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ముంబై ఇండియన్స్ మెంటార్ సచిన్ టెండుల్కర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘కామెరాన్ గ్రీన్, శుబ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్ కోసం అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
ఇక విరాట్ కోహ్లి వరుస సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రతి ఒక్కరు తమ క్లాస్ బ్యాటింగ్‌తో అలరించారు. ముంబై ప్లే ఆఫ్స్ చేరినందుకు సంతోషంగా ఉంది. గో ముంబై’’ అంటూ సెంచరీ వీరులపై ప్రశంసలు కురిపించాడు. పనిలో పనిగా తమకు పరోక్షంగా సాయం చేసిన గిల్‌కు థాంక్స్ చెప్పచెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై స్టార్ కామెరాన్ గ్రీన్ సుడిగాలి శతకంతో మెరిసిన విషయం తెలిసిందే.
.@CameronGreen_ & @ShubmanGill batted well for @mipaltan. 😜
— Sachin Tendulkar (@sachin_rt) May 21, 2023
Amazing innings by @imVkohli too to score back-to-back 100’s. They all had their methods & were in the class of their own.
So happy to see MI in the playoffs. Go Mumbai. 💙 #AalaRe #MumbaiMeriJaan #IPL2023 pic.twitter.com/D5iYacNEqc
Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6
— IndianPremierLeague (@IPL) May 21, 2023
Comments
Please login to add a commentAdd a comment