Photo Credit: CPL Twitter
ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైన ఆనందంలో శ్రీలంక మాజీ కెప్టెన్ దాసున్ షనక కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2026)లో శివతాండవం ఆడాడు. సీపీఎల్‌లో భాగంగా సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న షనక సెంట్ లూసియా కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 39 బంతుల్లోనే శతకం సాధించిన దాసున్ షనక ఓవరాల్‌గా 43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో షనక సాధించిన సెంచరీ అత్యంత వేగవంతమైన శతకంగా రికార్డులకెక్కింది. ఇటీవలే షిమ్రోన్ హెట్‌మైర్ 40 బంతుల్లో సెంచరీ సాధించగా, దానిని షనక అధిగమించి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Photo Credit: CPL Twitter
సీపీఎల్ చరిత్రలో షనక 39 బంతుల్లో సెంచరీ చేసి తొలి స్థానంలో నిలవగా, హెట్‌మైర్, టిమ్ సీఫెర్ట్, ఆండ్రీ రసెల్‌లు 40 బంతుల్లో శతకాలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మరో విండీస్ హిట్టర్ షెయ్ హోప్ 41 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక రసెల్ ఖాతాలో సీపీఎల్ రెండు ఫాస్టెస్ట్ సెంచరీలున్నాయి. ఒకసారి 40 బంతుల్లో శతకం చేస్తే, మరోసారి 42 బంతుల్లో సెంచరీ సాధించాడు.
దాసున్ షనక విధ్వంసంతో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. షనకకు తోడుగా వికెట్ కీపర్ ఆండ్రీ ఫ్లెచర్ (38 బంతుల్లో 64) అర్థసెంచరీతో రాణించాడు. అంతకముందు ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (26) ఆకట్టుకున్నాడు. సెంట్ లూసియా బౌలర్లలో మాథ్యూ ఫోర్డె 2 వికెట్లు తీయగా, తీక్షణ ఒక వికెట్ పడగొట్టాడు.
కాగా ఈ నెలలో లంక జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. టూర్‌లో భాగంగా శ్రీలంక వన్డేలతో పాటు టీ20 సిరీస్ ఆడనుంది. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక మాజీ కెప్టెన్ షనకను రెండు ఫార్మాట్లకు ఎంపిక చేయడం విశేషం. షనక తన చివరి మ్యాచ్‌ను 2024 జనవరిలో ఆడాడు.
RECORD BREAKER 🤩
Amazing scenes at Warner Park as Dasun Shanaka smashes the CPL record with a 39 ball 💯 😱🇱🇰#CPL26 #SKNPvSLK #DasunShanaka #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/w881tdoRrm— CPL T20 (@CPL) September 4, 2026
Read: ఆసీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు.. కట్‌చేస్తే ట్రిపుల్ సెంచరీ


