Photo Credit: BCCI Twitter
ఆసియా కప్ టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్ వుమెన్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మంధన రెండో స్థానానికి చేరుకుంది.
మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుజీ బేట్స్ (10,740 పరుగులు)ను అధిగమించింది. ప్రస్తుతం మంధన మూడు ఫార్మాట్లు కలిపి 10,750 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక తొలి స్థానంలో భారత దిగ్గజం మిథాలీరాజ్ (10,868 పరుగులు) ఉండగా, సుజీ బేట్స్ మూడో స్థానంలో ఉంది. చార్లెట్ ఎడ్‌వర్డ్స్ (10, 273 పరుగులు), స్టెఫానీ టేలర్ (10,007 పరుగులు) నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్‌ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్‌కు అవకాశం వచ్చినట్లు హర్మన్‌ప్రీత్ తెలిపింది.


