ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం.. పాపం న్యూజిలాండ్‌! | South Africa beats New Zealand by two wickets | Sakshi
Sakshi News home page

NZW vs RSAW: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం.. పాపం న్యూజిలాండ్‌!

Published Thu, Mar 17 2022 2:03 PM | Last Updated on Thu, Mar 17 2022 2:06 PM

South Africa beats New Zealand by two wickets - Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా విజయాల పరంపర కొనసాగిస్తోంది. చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా రెండు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాప్రికా 8 వికెట్లు కోల్పోయి చేధించింది. అఖరి ఓవర్‌లో 6 పరుగులు కావల్సిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ కాప్‌ బౌండరీ బాది జట్టును గెలిపించింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్ (67),సునే లూస్‌ (51), కాప్‌ (34) పరుగులతో రాణించారు.  న్యూజిలాండ్‌ బౌలర్లలో అమేలియా కేర్‌ మూడు వికెట్లు పడగొట్టగా, మాకే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 228 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో సోఫియా డివైన్(93), అమేలియా కేర్‌(42) గ్రీన్‌(30) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో  ఇస్మాయిల్, ఖాకా చెరో మూడు వికెట్లు సాధించారు. కాగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దక్షిణాఫ్రికా రెండో స్ధానంలో ఉంది.

చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని అనవసరంగా వదిలేసి..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement