
ఆఫ్రికన్ గేమ్స్ 2024లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. ఈ గేమ్స్‌లో ప్రోటీస్ తృతీయ శ్రేణి జట్టు పాల్గోంటుంది. ఈ ఈవెంట్‌లో భాగంగా ఘనాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ప్రోటీస్ బ్యాటర్లలో కెప్టెన్ జార్జ్ వాన్ హీర్డెన్(107) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు హెన్రిచ్ పీటర్(62) రాణించాడు. అనంతరం 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఘనా కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. ఇక మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ప్రోటీస్ కెప్టెన్ వాన్ హీర్డెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన యంగెస్ట్ కెప్టెన్‌గా వాన్ హీర్డెన్ నిలిచాడు. వాన్ హీర్డెన్ 20 ఏళ్ల 188 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు జింబావ్వే మాజీ కెప్టెన్ టెటాండా టైబ్(21 ఏళ్ల 248 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో టైబ్ ఆల్‌టైమ్ రికార్డును వాన్ హీర్డన్ నిలిచాడు.
చదవండి: WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్! ఎవరీ శ్రేయాంక?