
టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్‌లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఆన్ సాన్ అదరగొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఆమె 6–5తో ఎలీనా ఒస్పోవా (రష్యా)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. టోక్యోలో ఆన్ సాన్‌కిది మూడో పసిడి పతకం. తద్వారా ఒకే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన తొలి దక్షిణ కొరియా ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఆన్ సాన్ మహిళల టీమ్ విభాగంలో, మిక్స్‌డ్ విభాగంలోనూ విజేతగా నిలిచి స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment