‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’ | Spain Star Gavi Says Liandro Behaved Like A Physcopath But I Don't Want Him Punished, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

FIFA WC: ‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’

Jul 22 2026 8:04 AM | Updated on Jul 22 2026 10:39 AM

Spain Star Says Liandro-Behaves-Physcopath-But Dont-Want-To-Punish Him

Photo Credit: FIFA Twitter

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత స్పెయిన్‌, అర్జెంటీనా ఆటగాళ్లు తన్నుకున్న సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ స్పెయిన్ ఆటగాళ్ల మీదకు కోపంతో దూసుకొచ్చాడు. తన ఎదురుగా ఉన్న ఎరిక్ గార్సియాపై పిడిగుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన మరో ప్లేయర్‌ గావి గొంతు పట్టుకొని అతడిని నేలపై పడేశాడు. 

విచక్షణ కోల్పోయి పశువులా ప్రవర్తించిన లియాండ్రో పరేడెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. లియాండ్రోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయితే లియాండ్రోపై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది ఫిఫా ఇంకా తెలపనప్పటికీ స్పెయిన్ స్టార్ గావి మాత్రం లియాండ్రోను శిక్షించవద్దని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. 

‘లియాండ్రో ఓటమి నైరాశ్యంలో సైకోలా మారిపోయి మాపై దాడి చేశాడు. కానీ ఫుట్‌బాల్ ఆటలో ఇలాంటి గొడవలు సహజమని, ఓటమి బాధలో ఒక్కోసారి ఆటగాళ్లు లయతప్పి తాము ఏం చేస్తున్నామో కూడా మరిచిపోతారు. అందుకే లియాండ్రోను కఠినంగా శిక్షించవద్దని కోరుతున్నా. అంతగా శిక్ష వేయాలనుకుంటే అతడు భవిష్యత్తులో ఆడబోయే మ్యాచ్‌ల్లో ఆట మధ్యలో మైదానం నుంచి తొలగిస్తే సరిపోతుంది.’ అని తెలిపాడు. నిజానికి పరేడెస్ హింసాత్మక చర్యకు పాల్పడడం వల్ల అతడు కనీసం మూడు మ్యాచ్‌లు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫైనల్లో  ఆట అదనపు సమయం 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్‌తో, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో నాటకీయ విజయాన్ని అందుకుంది.  16 ఏళ్ల తర్వాత స్పెయిన్ రెండో ఫిఫా టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా చాంపియన్స్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన స్పెయిన్‌కు ఘన స్వాగతం లభించింది. 20 లక్షల మంది అభిమానుల సమక్షంలో స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో విజయోత్సవ సంబరాలు జరిగాయి.

 

Read: హండ్రెడ్‌ లీగ్‌లో ముంబై, సన్‌రైజర్స్‌ అరుదైన ఫీట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement