
Sunil Gavaskar Comments IND Vs PAK Should Play Final T20 World Cup.. టి20 ప్రపంచకప్ 2021 ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్ తలపడితే బాగుంటుందని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. ఇది నా ఒక్కడి కోరిక కాదని.. ఐసీసీ కౌన్సిల్ నుంచి ఫ్యాన్స్ వరకు ఇదే కోరుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌లలో 5 -0తో టీమిండియా పాకిస్తాన్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరిచిందని.. అలాగే వన్డే వరల్డ్‌కప్‌లో 7-0తో మంచి రికార్డు కలిగి ఉందని తెలిపాడు. లీగ్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌పై విజయం సాధించాలని ఆశాభావం వక్తం చేశాడు.
చదవండి: ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్‌కు ముప్పు.. పాక్ బ్యాటింగ్ కోచ్
ఇక టి20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరే నాలుగు జట్ల పేర్లను సునీల్ గావస్కర్ ప్రకటించాడు. పాకిస్తాన్ లెజెండ్ వసీమ్ అక్రమ్‌తో కలిసి సలామ్ క్రికెట్ 2021 కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సునీల్ గావస్కర్ తన ఫెవరెట్ జట్లను తెలిపాడు. సెమీస్ చేరే వాటిలో టీమిండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఉండాలని పేర్కొన్నాడు. ఇందులో టీమిండియా 2007 టి20 ప్రపంచకప్ విజేత కాగా.. 2009లో పాకిస్తాన్.. 2010లో ఇంగ్లండ్.. 2012, 2016లో వెస్టిండీస్ రెండుసార్లు టి20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచింది. ఇక అక్టోబర్ 24న టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
చదవండి: IND Vs PAK: టీమిండియాలో ఆ ప్లేయర్ ఇంజమామ్ లాంటి వాడు
Comments
Please login to add a commentAdd a comment