టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏ క్వాలిఫయర్స్‌లో భాగంగా నెదర్లాండ్స్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్‌లో ఓ హృదయ విదారక దృశ్యం అందరి మనసులను హత్తుకుంది. తన జట్టు సూపర్-12కు వెళ్లేందుకు నెట్ రన్‌రేట్ కీలకం కావడంతో నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ డెర్ మెర్వ్ నొప్పితో విలవిలలాడుతూనే బరిలోకి దిగి అందరి మనసులను గెలుచుకున్నాడు. వెన్ను నొప్పితో నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. తన జట్టు కోసం వెలకట్టలేని త్యాగం చేశాడు.
నెదర్లాండ్స్ 9 వికెట్లు కోల్పోయాక బ్యాటింగ్ చేసేందుకు ఎవరూ లేకపోవడంతో గాయంతో బాధపడుతున్న వాన్ డెర్ మెర్వ్ ధైర్యం చేసి బరిలోకి దిగి 19, 20 ఓవర్లు బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో అతను నొప్పి భరించలేక అతి కష్టం మీద పరిగెడుతూ కంటతడి పెట్టిన దృశ్యం అందరినీ కలచివేసింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఓడినప్పటికీ.. వాన్ డెర్ మెర్వ్ అందరి మనసులను గెలుచుకున్నాడు. వాన్ డెర్ మెర్వ్ ప్రదర్శించిన క్రీడా స్పూర్తి, అంకితభావానికి క్రికెట్ అభిమానులు సలాం కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-12 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఛేదనలో నెదర్లాండ్స్ 9 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment