టీమిండియా, పాకిస్తాన్ మధ్య సమరానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. టి20 ప్రపంచకప్ 2021 నేటి నుంచే ప్రారంభమవుతున్నప్పటికీ అందరి కళ్లు భారత్- పాక్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. హై వోల్టేజ్‌గా సాగే ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారనేది రేపటితో తేలిపోనుంది. ఇప్పటికైతే టీమిండియా ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ పాక్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ టి20ల్లో మరింత బలంగా తయారైంది. వన్డే ప్రపంచకప్‌లలో పాక్‌పై 7-0, టి20 ప్రపంచకప్‌లలో 5-0తో టీమిండియా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధ్యక్షుడు.. టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
''టీమిండియా 13-0తో పాకిస్తాన్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. రేపటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై గెలిచి రికార్డును టీమిండియా పదిలంగా ఉంచుకోవాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం టీమిండియాలో అందరూ మ్యాచ్ విన్నర్లే కనిపిస్తున్నారు. ఇక ఈ జట్టు 10 ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్‌ను గెలిచి నిరీక్షణకు తెర దించుతుందని ఆశిస్తున్నా. అలా అని పాకిస్తాన్‌ను తక్కువ చేసి చూడలేం. రేపటి మ్యాచ్‌లో ఇరు జట్లలో ఏ ఇద్దరు ఆటగాళ్లు మంచిగా ఆడితే విజయం వారిదే అవుతుంది. అయితే మ్యాచ్ గెలవడం కన్నా మానసికంగా దెబ్బతీయడం ముఖ్యం. నా దృష్టిలో ఇండియా- పాక్ మ్యాచ్ గొప్పవాటిలో ఒకటిగా మిగిలిపోనుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
Sourav Ganguly feels that winning the mental battle is very important and India can once again beat Pakistan in the T20 World Cup.#T20WorldCup #India #Pakistan pic.twitter.com/5jZevq5fHy
— Sportskeeda India (@Sportskeeda) October 23, 2021
Comments
Please login to add a commentAdd a comment