టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ(ఫైల్ ఫొటో)
ICC ODI World Cup 2023: పుష్కర కాలం తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఆడనుంది. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా మొదలుకానున్న ఐసీసీ ఈవెంట్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో తమ ప్రయాణం ఆరంభించనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడనుంది.
ఇక స్వదేశంలో మెగా టోర్నీ జరుగనున్న తరుణంలో రోహిత్ సేన హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. ఈసారి కూడా భారత్ ట్రోఫీని ముద్దాడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా ప్రధాన బలం అదే
భారత జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్ అని.. బ్యాటర్లు రాణిస్తేనే భారత్ టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆసియా కప్ ఫలితంతో ప్రపంచకప్ ఈవెంట్‌కు సంబంధం ఉండదని దాదా పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్... వరల్డ్‌కప్..
దేనికదే ప్రత్యేకం. ఒకదానితో మరొకదానికి సంబంధం లేదు. ప్రతి టోర్నమెంట్‌లోనూ ఆడే విధానం భిన్నంగా ఉంటుంది. భారత్ పటిష్ట జట్టు. ఒకవేళ మన బ్యాటర్లు రాణిస్తే కచ్చితంగా వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుస్తాం. కాబట్టి మొత్తమంతా మన బ్యాటర్లు ఎలా ఆడుతారన్న అంశం మీదే ఆధారపడి ఉంది’’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
పాక్ బౌలింగ్ దళం పటిష్టం
ఇక పాకిస్తాన్ జట్టు సైతం మెరుగ్గా ఉందన్న దాదా.. ‘‘పాక్ బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. నసీం షా, షాహిన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్ రాణిస్తున్నారు. మొత్తానికి పాక్ టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. అయితే, టీమిండియాతో పోటీ ఎలా ఉంటుందనేది చెప్పలేం.
మ్యాచ్ రోజు ఎవరు బాగా ఆడతారో విజయం వాళ్లనే వరిస్తుంది. అందులో రాకెట్ సైన్స్ ఏమీ లేదు’’ అని దాయాదుల పోరులో ఫేవరెట్ జట్టు ఏదీ లేదని చెప్పకనే చెప్పాడు. కాగా అక్టోబరు 14న పాక్‌తో అహ్మదాబాద్ వేదికగా రోహిత్ సేన మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్‌కప్ కంటే ముందు ఆసియా కప్‌లో సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.
చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్
Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
Comments
Please login to add a commentAdd a comment