Ishan Kishan May Come As Opener Vs NZ.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వస్తే దుమ్మురేపడం ఖాయమని టీమిండియా వెటరన్ ఆటగాడు హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. యూట్యూబ్ చానెల్‌లో హర్భజన్ మాట్లాడాడు.
''రోహిత్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్‌లో వస్తే.. పవర్ ప్లేలో టీమిండియా 60 నుంచి 70 పరుగులు కచ్చితంగా సాధిస్తుందనే నమ్మకం ఉంది. అతను క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఇషాన్ ఓపెనింగ్‌లో వస్తే కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఇన్‌ఫామ్ బ్యాటర్ రాహుల్ ఏ స్థానంలో ఆడినా అతను రాణించగలడు. అయితే హార్దిక్ పాండ్యా విషయంలో కొంత స్పష్టత అవసరం. కానీ అతను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. తనదైన రోజున బౌలర్లను ఉతికి ఆరేయగలడు. హార్దిక్ స్థానంలో వేరొకరిని తీసుకోవాలనుకుంటే శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఉత్తమం. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ సహాయపడగలడు.'' అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment