T20 World Cup 2021: Kohli Tease Pant Think Change Wicketkeeper Doesnt Focus - Sakshi
Sakshi News home page

T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా

Published Tue, Oct 26 2021 5:36 PM | Last Updated on Wed, Oct 27 2021 7:50 AM

T20 World Cup 2021: Kohli Tease Pant Think Change Wicketkeeper Doesnt Focus - Sakshi

Virat Kohli Teases Rishab Pant.. పాకిస్తాన్‌పై దారుణ పరాభవంతో టీమిండియా టి20 ప్రపంచకప్‌ 2021 సూపర్‌ 12 దశను ఆరంభించింది. టీమిండియా ఓటమి పట్ల అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా తర్వాతి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు వారం గ్యాప్‌ రావడంతో పాక్‌తో ఓటమిని అందరూ మరిచిపోతారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. రిషబ్‌ పంత్‌ను టీజ్‌ చేశాడు. '' ఆటలో నువ్వు ఫోకస్‌గా ఉండడం లేదని.. అందుకే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు నిన్ను పక్కన పెట్టాలనుకుంటున్నట్లు'' పంత్‌కు కోహ్లి వార్నింగ్‌ ఇచ్చాడు. అయితే ఇదంతా యాడ్‌లో భాగంగా మాత్రమే.టి20 ప్రపంచకప్‌ ప్రమోషన్‌లో భాగంగా మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌  కొత్త యాడ్‌ టీజర్‌ను విడుదల చేసింది.

చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్‌ ఔట్‌.. కారణం 

వీడియోలో కోహ్లి, పంత్‌ల మధ్య ఫోన్‌ సంభాషణ జరుగుతుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ తర్వాత అభిమానుల నుంచి వచ్చిన సూచనలను పంత్‌ కోహ్లికి వినిపిస్తున్నాడు. అందులో ఒక అభిమాని పంత్‌నుద్దేశించి.. పంత్‌ క్యాచ్‌ లేదా స్టంపింగ్‌ చేసిన తర్వాత ప్రతీసారి గ్లోవ్స్‌ను మార్చుకోవాలని సలహా ఇచ్చాడు. ఇది విన్న కోహ్లి.. అలా అయితే నేను సిక్స్‌ కొట్టిన ప్రతీసారి కొత్త గ్లోవ్స్‌ మార్చాల్సి ఉంటుంది.  తర్వాతి మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ను మారుస్తున్నా.. ఈ మధ్యన నీ  ఫోకస్‌ సరిగా లేదు.. అందుకే అంటూ కోహ్లి పంత్‌ను టీజ్‌ చేశాడు. ఇక చివరలో ఇవన్నీ వదిలేసి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌పై ఫోకస్‌ పెట్టు అని ముగిస్తాడు.

ఇక న్యూజిలాండ్‌తో తర్వాతి మ్యాచ్‌ ఆడనున్న టీమిండియాకు  మంచి రికార్డు లేదు. 2003 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఐసీసీ మేజర్‌ టోర్నీల్లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న ప్రతీసారి టీమిండియాకు పరాభవమే ఎదురైంది. 2007 టి20 ప్రపంచకప్‌, 2016 టి20 ప్రపంచకప్‌, 2019 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌.. తాజాగా 2021 వరల్డ్‌టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లోనూ టీమిండియా ఓడిపోవడం ఆసక్తి కలిగిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement