T20 World Cup Pakistan vs New Zealand Head to Head record in T20I: టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా మంగళవారం మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూపు-2లోని పాకిస్తాన్- న్యూజిలాండ్ షార్జా వేదికగా అక్టోబరు 26న అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో పాకిస్తాన్‌కు పర్యటనకు వచ్చిన కివీస్... భద్రతా కారణాల దృష్ట్యా ఆఖరి నిమిషంలో టూర్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లండ్ సైతం ఇదే కారణం చూపి పర్యటనకు రాలేమని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కారణంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, టీ20 ప్రపంచకప్‌లో ముఖాముఖి పోరులో ఎలాగైనా వారిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలంటూ పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్ ఆజం బృందానికి సూచించారు. మరోవైపు... తొలి మ్యాచ్‌లోనే టీమిండియాపై చారిత్రాత్మక విజయం సాధించడంతో పాక్ జట్టుపై అంచనాలు మరింతగా పెరగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాక్- కివీస్ పోరు మరింత రసవత్తరంగా మారింది. మరి.. ఇప్పటి వరకు టీ20లలో ఈ జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయి? ఏ జట్టు రికార్డు ఎలా ఉంది?
పాకిస్తాన్‌దే పైచేయి..
►ఇప్పటి వరకు పాకిస్తాన్- న్యూజిలాండ్ 24 టీ20 మ్యాచ్‌లలో పోటీపడ్డాయి.
►ఇందులో 14 సార్లు పాకిస్తాన్ విజయం సాధించగా.. కివీస్ 10సార్లు గెలుపొందింది.
►ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్లలో పాక్- కివీస్ 5 సార్లు తలపడగా... 3-2తో పాకిస్తాన్ ముందంజలో ఉంది.
అత్యుత్తమ ప్రదర్శన
►పాకిస్తాన్ వెటరన్ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌కు న్యూజిలాండ్‌పై అత్యద్భుత రికార్డు ఉంది. కివీస్‌పై అతడు 552 పరుగులు చేశాడు.
►ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే... పాకిస్తాన్‌పై మార్టిన్ గఫ్టిల్(509), కేన్ విలియమ్సన్(414) మెరుగైన రికార్డు కలిగి ఉన్నారు.
►కివీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టిమ్ సౌథీ(23) ముందు వరుసలో ఉండగా.. ఆడం మిల్నే(15), మిచెల్ సాంట్నర్(9) అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీ20 వరల్డ్‌కప్‌లో ముఖాముఖి.. విజయాలు
►సెప్టెంబరు 22, 2007-కేప్‌టౌన్
6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై పాక్ విజయం
►జూన్ 13, 2009- ఓవల్
6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపొందిన పాక్
►మే 8, 2010- బ్రిడ్జ్‌టౌన్
ఒక్క పరుగు తేడాతో పాక్‌పై కివీస్ గెలుపు
►సెప్టెంబరు 23, 2012- పల్లకెలె
13 పరుగుల తేడాతో కివీస్‌పై పాక్ జయభేరి
►మార్చి 22, 2016- మొహాలి
22 పరుగుల తేడాతో పాక్‌పై కివీస్ విజయ దుందుభి
జట్లు:
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టిమ్ సీఫర్ట్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, టాడ్ ఆస్ట్లే, కైలీ జెమీషన్, మార్క్ చాప్‌మాన్, జిమ్మీ నీషమ్.
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాబాద్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షాహిన్ ఆఫ్రిది, హైదర్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, సర్ఫరాజ్ అహ్మద్.
తుది జట్ల అంచనా:
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, టిమ్ సీఫర్ట్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్/టాడ్ ఆస్ట్లే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్.
పాకిస్తాన్: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాబాద్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షాహిన్ ఆఫ్రిది.
►ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీ వార్మప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో కివీస్.. ప్రాక్టీసు మ్యాచ్(వెస్టిండీస్) సహా మేజర్ మ్యాచ్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో జోష్‌లో బాబర్ ఆజం బృందం.. మరి అక్టోబరు 26 నాటి రసవత్తర పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి! మీ అభిప్రాయం చెప్పండి!
చదవండి: T20 WC: చెత్త ప్రదర్శన.. ప్రపంచకప్ ఆడటానికి వచ్చారా.. టూరిస్ట్ వీసా మీద ఉన్నారా?
Comments
Please login to add a commentAdd a comment