T20 World Cup 2021: Rishab Pant One Hand Six Vs ENG Warm-up Match Viral - Sakshi
Sakshi News home page

Rishab Pant: ఒంటి చేత్తో పంత్‌ కళ్లు చెదిరే సిక్స్‌‌.. వీడియో వైరల్‌

Published Tue, Oct 19 2021 2:05 PM | Last Updated on Tue, Oct 19 2021 5:56 PM

T20 World Cup 2021: Rishab Pant One Hand Six Vs ENG Warm-up Match Viral - Sakshi

Courtesy: BCCI Twitter

Rishab Pant One Hand Six.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో  టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఒంటి చేత్తో కొట్టిన సిక్స్‌ వైరల్‌గా మారింది. మొయిన్‌ అలీ బౌలింగ్‌ ఇన్నింగ్స్‌ 13.4 ఓవర్‌లో లాంగాఫ్‌ దిశగా ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్స్‌ బాదాడు. అతని సిక్స్‌ దెబ్బకు బంతి స్టేడియం అవతల పడడంతో కొత్త బంతి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను స్కై స్పోర్ట్స్‌ తమ యూట్యూబ్‌ చానెల్‌లో షేర్‌ చేసింది.

చదవండి: T20 World Cup IRE Vs NED: కర్టిస్‌ సంచలనం.. 4 బంతుల్లో 4 వికెట్లు!

ఇక మ్యాచ్‌లో పంత్‌ (14 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 29 పరుగులు నాటౌట్‌) టీమిండియాను గెలిపించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇషాన్‌ కిషన్‌ 70(రిటైర్డ్‌హర్ట్‌), కేఎల్‌ రాహుల్‌ 51 పరుగులతో ఆకట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement