Virat Kohli’s Teenage Coach Suresh Batra Dies At 53 - Sakshi
Sakshi News home page

గుండెపోటుతో క్రికెట్‌ కోచ్‌ కన్నుమూత.. విషాదంలో  కోహ్లి

Published Sat, May 22 2021 4:07 PM | Last Updated on Sat, May 22 2021 4:32 PM

Team India Captain Virat Kohli Childhood Coach Suresh Batra Passes Away - Sakshi

ఫైల్‌ఫోటో

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చిన్ననాటి కోచ్‌ సురేశ్‌ బాత్రా శనివారం గుండెపోటుతో మరణించారు. 53 ఏళ్ల సురేశ్‌ ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్‌ అకాడమీలో అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కోహ్లి టీనేజ్‌ వయసులో ఉన్నప్పుడు సురేశ్‌ బాత్రా అతనికి బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించారు. కోహ్లి బ్యాటింగ్‌ స్టైల్‌లో మార్పు రావడంలో సురేశ్‌ కీలకపాత్ర పోషించారు. కాగా ఢిల్లీ క్రికెట్‌ అకాడమీలో హెడ్‌ కోచ్‌గా ఉన్న రాజ్‌కుమార్‌ శర్మ ట్విటర్‌లో స్పందించారు. ' నేను ఈరోజు నా తమ్ముడిని కోల్పోయాను. సురేశ్‌బాత్రాతో నాకు 1985 నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందరో క్రికెటర్లను తయారు చేసిన సురేశ్‌ కోహ్లికి కూడా కోచ్‌గా వ్యవహరించాడు. అతని మృతి మాకు తీరని లోటు అంటూ ట్వీట్‌ చేశారు.  

కాగా కోహ్లి ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు టీమిండియాతో కలిసి జూన్‌ 2న ఇంగ్లండ్‌ బయల్దేరనున్నాడు. కివీస్‌తో టెస్టు చాంపియన్‌షిప్‌ ముగిసిన అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.
చదవండి: 'కోహ్లిని ఉదాహరణగా తీసుకోమని చెప్పా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement