తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్‌! | Tim David Punished For Disobeying Umpires-Hardik Pandya Fined Rs 12 Lakh | Sakshi
Sakshi News home page

IPL 2026: తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్‌!

Apr 13 2026 6:37 PM | Updated on Apr 13 2026 7:25 PM

Tim David Punished For Disobeying Umpires-Hardik Pandya Fined Rs 12 Lakh

Photo Courtesy: IPL 2026

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తన ప్రవర్తనతో అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. అంపైర్లకు బంతిని అందించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఐపీఎల్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా టిమ్‌ డేవిడ్‌పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.4 ప్రకారం టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించినట్లు ఐపీఎల్ కౌన్సిల్ తెలిపింది. జరిమానా విధించడం ద్వారా టిమ్‌ డేవిడ్‌ తిక్క కుదిరిందని అభిమానులు కామెంట్లు చేశారు. 

పాండ్యాకు జరిమానా..
మరోవైపు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఆదివారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేసినందుకు పాండ్యాకు జ‌రిమానా విధిస్తూ ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టిక‌ల్ 2.22 ప్ర‌కారం హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై జట్టుకు ఇదే మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని వెల్లడించింది.

టిమ్‌ డేవిడ్‌ ఏం చేశాడంటే?
ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. అయితే డేవిడ్ బ‌లంగా బాద‌డంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయ‌డం ప్రారంభించాడు. 

అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాల‌ని ప‌దే ప‌దే అడిగిన‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ అత‌డిని ప‌ట్టించుకోకుండా అదే ప‌నిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేంద‌ర్ శ‌ర్మ వ‌చ్చి ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని వార్నింగ్ ఇవ్వ‌డం, ఇంత‌లో ముంబై ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: ‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement