
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూఫ్ జెలో భాగంగా హాంకాంగ్‌కు చెందిన చియాంగ్ ఎంగన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 21-9, 21-16తో వరుస గేముల్లో గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది.తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధుకు.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
ఒక దశలో పీవీ సింధు 6-11తో వెనుకబడడంతో టై బ్రేక్ దారి తీసి మూడో రౌండ్ ఆడాల్సి వస్తుందని అంతా భావించారు. కానీ సింధు తన ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా దెబ్బకొడుతూ వరుసగా పాయింట్లు సాధించింది. సింధు తొలి మ్యాచ్‌లోనూ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ జే టాపర్‌గా సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో పోటీ పడనుంది. ఒక వేళ క్వార్టర్స్‌కు చేరుకుంటే అక్కడ అకానే యమగుచితో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment