Urvashi Rautela Arrives In Australia, Her Insta Post Gone Viral - Sakshi
Sakshi News home page

పంత్‌ను మరోసారి గెలికిన రౌతేలా.. లవ్‌ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ..!

Published Sun, Oct 9 2022 4:32 PM | Last Updated on Sun, Oct 9 2022 4:46 PM

Urvashi Rautela Arrives In Australia, Her Insta Post Gone Viral - Sakshi

టీమిండియా యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌, బాలీవుడ్‌ అప్‌కమింగ్‌ నటి ఊర్వశి రౌతేలాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజుల కిందట ఊర్వశి.. పంత్‌కు సారీ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. ఈలోపే ఊర్వశి.. పంత్‌ను మరోసారి గెలికింది. పంత్‌ టార్గెట్‌గా.. లవ్‌ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ వయ్యారంగా ఓ ప్రైవేట్‌ జెట్‌లో కూర్చొన్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఊర్వశి నుంచి ఊహించని ఈ చర్యతో నెటిజన్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

ప్రేమ కోసం (పంత్‌) చిన్నది సప్త సముద్రాలు దాటి వెళ్తుందని కొందరు.. ఈమె పంత్‌ను ప్రశాంతంగా బ్రతకనిచ్చేట్లు లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా ప్రపంచకప్‌ గెలవాలంటే పంత్‌ పాత్ర చాలా కీలకమని, దయ చేసి అతన్ని వదిలేయమ్మా.. డిస్టర్భ్‌ అవుతాడని మరికొందరు ఊర్వశిని ఉతికి ఆరేస్తున్నారు. ఇంకొందరైతే ఊర్వశి ఇటీవల పాక్‌ యువ పేసర్‌ నసీం షాతో కలిసి ఉన్నట్లు యానిమేట్‌ చేసిన పోస్ట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. అమ్మడు మనకు మంచే చేయడానికి వస్తుంది. వరల్డ్‌కప్‌లో పాక్‌కు నసీం షా కీలక బౌలర్‌. అమ్మడు వాణ్ణి తగులుకుంటే మన పని ఇంకా సులువవుతుందని చర్చించుకుంటున్నారు. 

నువ్వు నిజంగా భారతీయురాలివైతే మెగా టోర్నీకి ముందు టీమిండియాలోని కీలక సభ్యున్ని ఇలా గెలకవని కొందరు తూర్పారబెడుతుండగా.. ఏదిఏమైనా వరల్డ్‌కప్‌ లాంటి మెగా ఈవెంట్‌కు ముందు ఊర్వశి ఇలాంటి మూడ్‌ డైవర్ట్‌ అయ్యే పోస్ట్‌లు పెట్టకూడదని, మీకు మీకు ఏమైనా ఉంటే మ్యాచ్‌ల్లేని సమయాల్లో చూసుకోవాలని ఇంకొందరు సూచిస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్‌ ఆడేందుకు రిషబ్‌ పంత్‌ టీమిండియాతో పాటు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  
చదవండి: సారీ చెప్పింది పంత్‌కు కాదు.. నా ప్రియమైన వారికి.. మాట మార్చిన రౌతేలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement