ఊర్వశి రౌతేలా షేర్‌ చేసిన వీడియో.. ట్రోల్‌ అవుతున్న రిషబ్‌ పంత్‌ | Urvashi Rautela And Rishabh Pant Again Went Viral | Sakshi
Sakshi News home page

Urvashi Rautela And Rishabh Pant: ఊర్వశి రౌతేలా షేర్‌ చేసిన వీడియో.. ట్రోల్‌ అవుతున్న రిషబ్‌ పంత్‌

Published Fri, Nov 3 2023 9:03 AM | Last Updated on Fri, Nov 3 2023 9:57 AM

Urvashi Rautela And Rishabh Pant Again Viral - Sakshi

భారత్‌లో క్రికెట్‌ ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. అన్ని చోట్లా వరల్డ్‌ కప్‌ ఫీవర్ ఎక్కువైంది. ఈసారి భారత్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఓటమి అనేది లేకుండా భారత్ తనదైన ప్రదర్శనదో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. భారత్ గెలుస్తుంటే, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఈ జట్టులో చాలా మంది మిస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ వీడియో చేసి సర్ ప్రైజ్ చేసింది. ఆ వీడియో చూసిన జనాలు రిషబ్ పంత్‌ని గుర్తుచేసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు సంవత్సరం నుంచి క్రికెట్‌కు రిషబ్‌ దూరంగా ఉ‍న్న విషయం తెలిసిందే.

కొద్దిరోజుల క్రితం ఊర్వశి రౌతేలా, భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య సోషల్‌ మీడియా వార్‌ కూడా భారీగానే నడిచింది. అప్పట్లో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని తర్వాత కొన్ని గొడవల వల్ల విడిపోయారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఎవరూ ఖండిచలేదు. తాజాగా ఊర్వశి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తనకు అనిపించిన విషయాన్ని సూటిగా చెప్పే నటి. ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. వైట్ అండ్ వైట్ స్టోర్ట్స్ డ్రెస్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో అది. దీనితో పాటు 'కొత్త అధ్యాయం, కొత్త సినిమా' అని రాసి ఆమె పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ‘కీడా కోలా’ మూవీ రివ్యూ)

ఆ వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా చుట్టు ఎప్పుడూ కొంత వివాదం ఉన్న మాట నిజం. అందులో రిషబ్ పంత్‌తో వివాదం కూడా ఒకటి. ఆ వ్యక్తి (రిషబ్‌) తనకు చాలాసార్లు ఫోన్ చేశాడని ఆమె గతంలో చేసిన ప్రకటన ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం ఊర్వశి కూడా క్షమాపణలు చెప్పింది. మళ్లీ తాజాగా కొత్త సినిమా కోసమే అంటూ.. వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దీంతో రిషబ్ పంత్ గొడవను  మళ్లీ తెరపైకి తెస్తుందా..? అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు.

ఊర్వశి రౌతేలా తన వికెట్ కీపింగ్ వీడియోలో కీపర్‌ ఉపయోగించాల్సిన గ్లౌజులు కాకుండా బ్యాటింగ్‌ గ్లౌజులను ఉపయోగించింది. దీనిని గమనించిన నెటిజన్లు ఊర్వశి రౌతేలాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. 'ఆమె బ్యాటింగ్ గ్లౌజులతోనే ఆట ఆడుతుంది.. ఎందుకంటే ఆమెకు ధైర్యం ఉంది' అంటూ ఫన్నీగా అని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. మరోకరు రిషబ్ పంత్ రీప్లేస్ మెంట్ దొరకలేదా..? అంటూ కామెంట్‌ చేస్తే.. 'రిషబ్ పంత్ లైట్ వెర్షన్' అని మరొకరు వ్యాఖ్యానించారు ఊర్వశి పోస్ట్ చేసిన వీడియోతో రిషబ్ పంత్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా ఆయన ట్రోల్ అవుతున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement