వైభ‌వ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! | Vaibhav Sooryavanshi Fails With Bat-14 Runs Out Vs SL-A Match | Sakshi
Sakshi News home page

SL A Vs IND A: వైభ‌వ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు!

Jun 9 2026 10:45 AM | Updated on Jun 9 2026 11:24 AM

Vaibhav Sooryavanshi Fails With Bat-14 Runs Out Vs SL-A Match

టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చర‌పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ శ్రీలంక‌-ఏతో జ‌రుగుతున్న వ‌న్డే మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన వైభ‌వ్ 12 బంతుల్లో 14 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించినప్పటికీ మొహ‌మ్మ‌ద్ షిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్ర‌య‌త్నించిన వైభ‌వ్ మిడాఫ్‌లో దొరికిపోయాడు. వైభ‌వ్ కొట్టిన బంతిని సాహ‌న్ అరాచిగే ఎలాంటి పొర‌పాటు చేయ‌కుండా క్యాచ్ అందుకున్నాడు. 

దీంతో వైభ‌వ్ చెల‌రేగుతాడని ఆశించిన అభిమానులు నిరాశే ఎదురైంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన నెట్ సెషన్‌లో వైభవ్ కొంత సమయం రక్షణాత్మక బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాడు. సాధారణంగా దూకుడైన ఆటకు పెట్టింది పేరైన వైభ‌వ్ వ‌న్డే మ్యాచ్ కావ‌డంతో ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఆడాల‌ని నిర్ణయించుకున్నాడు.  

కానీ ఇవాళ్టి మ్యాచ్‌లో మాత్రం వైభ‌వ్ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ గెలిచిన ఇండియా-ఏ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 7 ఓవ‌ర్లు ముగిసేసరికి ఇండియా జ‌ట్టు 2 వికెట్ల న‌ష్టానికి 30 ప‌రుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (12), రుతురాజ్ గైక్వాడ్ (2) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో తనడైన ముద్ర వేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన వైభ‌వ్‌.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

టీ20 ఫార్మాట్ లో ఇప్పటికే తన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ క్రికెట్‌లో వేగంగా ఎదుగుతున్న యువ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతడి దూకుడైన శైలి, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం భారత క్రికెట్ వర్గాల్లో అంచనాలు పెంచాయి. ఇప్పుడు శ్రీలంక-ఏ, ఆ తర్వాత అఫ్గానిస్థాన్-ఏ జట్లపై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు.

గ‌తేడాది ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్లో యూఏఈపై ఇండియా-ఏ తరఫున వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు బాదిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బుడ్డాడు.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్‌ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement