బుడ్డోడి వికెట్‌తో మిస్ట‌రీ స్పిన్న‌ర్‌ అరుదైన రికార్డు! | Varun Chakravarthy Completes 200 Wickets In T20 Cricket With Vaibhav Wicket | Sakshi
Sakshi News home page

బుడ్డోడి వికెట్‌తో మిస్ట‌రీ స్పిన్న‌ర్‌ అరుదైన రికార్డు!

Apr 19 2026 4:49 PM | Updated on Apr 19 2026 5:16 PM

Varun Chakravarthy Completes 200 Wickets In T20 Cricket With Vaibhav Wicket

Photo Courtesy: IPL 2026

టీ20 క్రికెట్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మ‌రో రికార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ వికెట్ తీయ‌డం ద్వారా ఈ మిస్ట‌రీ స్పిన్న‌ర్ త‌న ఖాతాలో 200వ వికెట్ జ‌మ చేసుకున్నాడు. 

కాగా టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 155 మ్యాచ్‌లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న రెండో భార‌త బౌల‌ర్‌గా వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా పేస‌ర్‌ అర్ష్‌దీప్ సింగ్ (151 మ్యాచ్‌లు ఉన్నాడు. 2019లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి తొలుత పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. 

ఆ త‌ర్వాత కేకేఆర్‌కు మారిన ఈ మిస్ట‌రీ స్పిన్న‌ర్ అప్ప‌టి నుంచి అదే జ‌ట్టులో కొన‌సాగుతున్నాడు.  అయితే వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి ఈ సీజ‌న్‌లోనే గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ త‌ర‌ఫున వంద వికెట్లు సాధించాడు. కేకేఆర్ త‌ర‌ఫున వంద వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా నిలిచాడు. 

గ‌తంలో సునీల్ న‌రైన్‌, ఆండ్రీ ర‌సెల్‌లు ఈ ఘ‌న‌త సాధించారు. ఓవ‌రాల్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఐపీఎల్‌లో 89 మ్యాచ్‌ల్లో 105 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక టీమిండియా త‌ర‌ఫున వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 45 టీ20ల్లో 73 వికెట్లు ప‌డ‌గొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నాడు.

 చదవండి: తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్‌!

Advertisement
 
Advertisement
Advertisement