
టీ20 ప్రపంచకప్-2022 (గ్రూప్-2)లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 28 పరుగలు సాధిస్తే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.
ప్రస్తుతం ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే 1016 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. కాగా ఇప్పటి వరకు 23 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 989 పరుగులు సాధించాడు.
అతడు ఇన్నింగ్స్‌లో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో 82 పరుగులతో అదరగొట్టిన కోహ్లి.. అనంతరం నెదర్లాండ్స్‌పై 62 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: AUS Vs WI: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! చంద్రపాల్ కొడుకు ఎంట్రీ