
కోహ్లి(PC: Disney + Hotstar)
పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు వికెట్ పడగొట్టి సంబరాలను శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేస్తూ జరుపుకుంటున్నారు. కాగా స్టార్ క్రికెటర్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్‌లు కూడా ఈ పాటకు స్టెప్పులు వేశారు. తాజగా ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా చేరాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడియన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న కోహ్లి, శ్రీవల్లి పాటకు తన దైన శైలిలో స్టెప్పులు వేశాడు.
ఇన్నింగ్స్ 45 ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఓడియన్ స్మిత్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది మిస్ టైమ్ అవ్వడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ పట్టిన ఆనందంలో తనదైన శైలిలో తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్‌పై 44 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
That Winning Feeling! 👏 👏@prasidh43 picks his fourth wicket as #TeamIndia complete a 4⃣4⃣-run win over West Indies in the 2nd ODI. 👍 👍 #INDvWI @Paytm
— BCCI (@BCCI) February 9, 2022
Scorecard ▶️ https://t.co/yqSjTw302p pic.twitter.com/R9KCvpMImH
VIRAT KOHLI Done Srivalli Step 🕺#ViratKohli #Pushpa #Kohli #Srivalli #INDvWI #AlluArjun #PushpaTheRule pic.twitter.com/cXkKp2Ah9H
— #BheemlaNayak❤️🔥 (@sudheerrealhero) February 9, 2022
Comments
Please login to add a commentAdd a comment