
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజు ఆటలో భారత్‌పై ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా(104 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు.
ఉస్మాన్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. అతడితో పాటు కామెరాన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు కెప్టెన్ స్మిత్(38), హెడ్(32) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్ తలా వికెట్ సాధించారు.
మ్యాచ్ మధ్యలో చాక్లెట్ తిన్న కోహ్లి
తొలి రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చాక్లెట్‌ను తింటూ కెమెరాకి చిక్కాడు. అంతేకాకుండా షమీ బంతిని వేయడానికి సిద్దమయ్యే క్రమంలో సగం తిన్న చాక్లెట్‌ను కోహ్లి.. సెకెండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ పైకి విసిరాడు.
అయ్యర్ దానిని తన జేబులో పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా స్లీప్‌లో ఫీల్డింగ్ చేసే ప్లేయర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. అటువంటిది చాక్లెట్‌లు తింటూ కాలక్షేపం చేస్తున్న కోహ్లిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా ఈ సిరీస్‌లో కోహ్లి అదే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ దాదాపు నాలుగు సులువైన క్యాచ్‌లను జారవిడిచాడు.
చదవండి: Ind Vs Aus: జడ్డూ దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి! అంత ఓవరాక్షన్ ఎందుకు స్మిత్? వీడియో వైరల్
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 9, 2023
Comments
Please login to add a commentAdd a comment