ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పర్వాలేదనిపించాడు. 35 పరుగులు సాధించిన కోహ్లి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నంతసేపు కోహ్లి తనదైన షాట్లతో అభిమానులను అలరించాడు. అయితే భారత్ ఇన్నింగ్ ఏడో ఓవర్ వేసిన స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో కోహ్లి లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో బంతి నేరుగా నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ శర్మ తాకింది. దీంతో రోహిత్ శర్మ ఒక్క సారిగా కిందపడిపోయాడు. అయితే వెంటనే పైకి లేచిన రోహిత్ నవ్వుతూ సింగిల్‌కు పరిగెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్ స్పందిస్తూ.. "ఇదేం షాట్ కోహ్లి భాయ్.. రోహిత్‌ను కింద పడేశావుగా" అంటూ కామెంట్ చేశాడు. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ సంక్షిప్త సమాచారం
టాస్: భారత్ బౌలింగ్
పాకిస్తాన్: 147/10
పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్: మహ్మద్ రిజ్వాన్(42 బంతుల్లో 43 పరుగులు)
భారత బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు, హార్ధిక్ పాండ్యా 3వికెట్లు, అర్షదీప్ సింగ్ 2వికెట్లు
టీమిండియా : 148/5(19.4 ఓవర్లు)
భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్లు: విరాట్ కోహ్లి(35), జడేజా(35)
పాక్ బౌలింగ్: మహ్మద్ నవాజ్ మూడు వికెట్లు, నషీమ్ షా రెండు వికెట్లు
విజేత: 5 వికెట్ల తేడాతో పాక్‌పై టీమిండియా విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా( మూడు వికెట్లతో పాటు 33 పరుగులు (నాటౌట్))
— Yoloapp (@Yoloapp2) August 28, 2022
చదవండి: Asia Cup 2022: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment