
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి భారత గడ్డపై అడుగుపెట్టాడు. తన భార్య ప్రసవం కారణంగా ఇన్నాళ్లు లండన్‌లో ఉండిపోయిన విరాట్ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు. శనివారం(మార్చి16) రాత్రి బెంగళూరుకు కోహ్లి చేరుకున్నాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు మరో మూడు రోజుల సమయం ఉన్నందన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆదివారం విరాట్ కలవనున్నాడు.
డిసెంబర్ 19న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆర్సీబీ ఆన్ బాక్స్ ఈవెంట్‌లో కోహ్లి పాల్గోనున్నాడు. కాగా కోహ్లి దాదాపు మూడు నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టెస్ట్ సిరీస్‌కు కింగ్ కోహ్లి దూరమయ్యాడు.
ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి.
ఆర్సీబీ జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, గ్లెన్ మాక్స్‌వెల్, విల్ జాక్స్, మహ్మద్ సిరాజ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పాటీదార్, ఆకాశ్ దీప్, మయాన్సెక్, మయాన్సెక్ టాప్లీ, కర్ణ్ శర్మ, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, సౌరవ్ చౌహాన్, స్వప్నిల్ సింగ్.
KING KOHLI AT THE MUMBAI AIRPORT.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2024
- The GOAT is coming back!! 🐐pic.twitter.com/7MXeik5eHI