రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో లేకపోతే కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా సరైనోడని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్‌తో పునరాగమనం చేసిన హార్ధిక్ పాండ్యా అధ్బుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్‌గా హార్ధిక్ తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. అదే విధంగా ఆల్‌రౌండర్‌గా కూడా హార్ధిక్ అదరగొట్టాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ అప్పగించింది.
"టీమిండియా కెప్టెన్‌గా హార్ధిక్ అర్హుడని నేను భావిస్తున్నాను. జట్టును విజయ పథంలో నడిపే సత్తా పాండ్యాకు ఉంది. ఒక వేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే, కెప్టెన్ హార్దిక్ పాండ్యానే మొదటి ఎంపికగా భావిస్తాను. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తమ జట్టును హార్ధిక్ అద్భుతంగా నడిపించాడు. అదే విధంగా తన వ్యక్తిగతంగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. రోహిత్ అందుబాటులో ఉంటే హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ ఏదైనా సిరీస్‌కు లేదా మ్యాచ్‌కు దూరమైతే అప్పుడు హార్ధిక్ అవకాశం లభిస్తుంది" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs IRE T20 Series: పృథ్వీ షా చేసిన నేరం.. 'పనికిరాని ఆటగాడిగా కనిపిస్తున్నాడా?
Comments
Please login to add a commentAdd a comment