
ఐపీఎల్-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అయితే ఫైనల్ పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 61 శాతం వర్షం వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూవెదర్ కూడా తెలిపింది.
మ్యాచ్ రద్దయితే..?
ఒక వేళ వర్షం కారణంగా ఆదివారం మ్యాచ్ నిర్వహించడానికి వీలుకాకపోతే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే సోమవారం నాడు ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఎందుకంటే ఆ రోజును ఫైనల్ కోసం రిజర్వ్ డేగా బీసీసీఐ ప్రకటించింది. అదే విధంగా మ్యాచ్ మొదలయ్యాక వర్షం అంతరాయం కలిగిస్తే.. మ్యాచ్ ఎక్కడ అయితే ఆగిందో సోమవారం అక్కడనుంచి ప్రారంభం అవుతుంది.
మరోవైపు ఆదివారం టాస్ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్‌డే సోమవారం రోజు టాస్ నిర్వహిస్తారు. అయితే రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. టెబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. కాగా కనీసం సూపర్ ఓవర్ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది.
చదవండి: CSK Vs GT: ధోని.. అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు! ఈరోజు మాత్రం తనదే!
Comments
Please login to add a commentAdd a comment