యూఎస్ మాస్టర్ టీ10 లీగ్‌లో న్యూజెర్సీ లెజెండ్స్ రెండో విజయం నమోదు చేసింది. ఫ్లోరిడా వేదికగా కాలిఫోర్నియా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజెర్సీ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలిఫోర్నియా నైట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
కాలిఫోర్నియా బ్యాటర్లలలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3ఫోర్లతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. న్యూజెర్సీ బౌలర్లలో ట్రిగో, బార్నవాల్ తలా వికెట్ పడగొట్టారు.
యూసుఫ్ పఠాన్ ఊచకోత..
117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓవర్లలో ఛేదించింది. టీమిండియా మాజీ ఆటగాడు, న్యూజెర్సీ బ్యాటర్ యూసుఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్ ఓజా(25) పరుగులతో రాణించాడు. మరో మ్యాచ్‌లో అట్లాంటా రైడర్స్‌పై 7 వికెట్ల తేడాతో న్యూయార్క్ వారియర్స్ విజయం సాధించింది.
చదవండి: Asia Cup 2023 Team India Squad: అందుకే చాహల్‌కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్!
Comments
Please login to add a commentAdd a comment