అందరూ రహదారి నిబంధనలు పాటించాలి
● ముగిసిన రహదారి భద్రత మాసోత్సవాలు
నెల్లూరు (టౌన్): ప్రతి వాహనాదారుడు తప్పనిసరిగా రహదారి నిబంధనలను పాటించాలని ఇన్‌చార్జి ఆర్టీఓ బాలమురళీకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓవర్ స్పీడ్, మద్యం తాగి వాహనం నడపడడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగం తదితర వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రమాదాల్లో ఒకరు చేసిన తప్పు వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వాహనానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా పొందాలన్నారు. ఈ సమావేశంలో ఎంవీఐలు ఎండీ రఫీ, కార్తీక్, ఏఎంవీఐలు పూర్ణచంద్రరావు, మల్లికార్జున్‌రెడ్డి, ఆటో, లారీ యూనియన్ నాయకులు, డ్రైవింగ్ స్కూల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment