
నిబంధనలు అతిక్రమించొద్దు
సైదాపురం: నిరుపేద గిరిజనులు, పేదలు సాగు చేసుకునే పొలాలను నిబంధనలను మితిమీరి ఎలా స్వాధీనం చేసుకుంటారని, నిబంధనలు అతిక్రమించొద్దంటూ హైకోర్టు రెవెన్యూ అధికారులకు మొట్టికాయలు వేస్తూనే.. ఈ విషయంలో నిబంధనలు ప్రకారం నడుచుకోవాలంటూ ఈ నెల 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపురంలోని 793 ఏ సర్వే నంబర్‌లో ఉన్న 114 ఎకరాల భూమికి మైనింగ్ లీజు ఉండేది. గడిచిన కొన్నేళ్లగా లీజు గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలోనే సమీపంలోని కమ్మవారిపల్లికి చెందిన ఐదు గిరిజన కుటుంబాలతో పాటు మరో 10 మంది నిరుపేదలు ఎకరా నుంచి రెండెకరాల వంతున అక్రమించుకుని నిమ్మ తోటలను సాగు చేసుకుంటున్నారు. అయితే సాగులో ఉన్న ఆ భూములను స్వాధీనం చేసేందుకు అధికారులు ప్రయత్నించడంతో గిరిజనులతోపాటు పేదలు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలే తప్ప ఇప్పటికిప్పుడు చర్యలు చేపట్ట వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
పేదలం మాకు న్యాయం చేయండి
తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి అందుకోవాలని ప్రభుత్వ భూముల్లో నిమ్మ సాగు చేసుకుంటున్న రైతులు అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై అధికారులకు కూడా వినతిపత్రంతో పాటు కోర్డు ఆర్డర్‌ను అందజేయనున్నట్లు బాధితులు పేర్కొన్నారు. తాము కష్టపడి రెండెకరాల వంతున ఆక్రమించుకుని, అప్పులు తెచ్చి నిమ్మతోటలపై పెట్టుబడులు పెట్టాం. తీరా పంట చేతికొచ్చే సరికి ఆ భూములు మైనింగ్ లీజులు ఇచ్చే ప్రయత్నం చేయడం సరికాదు.
రెవెన్యూ అధికారులకు హైకోర్టు
మొట్టికాయలు
నిరుపేద గిరిజనులు, పేద రైతులకు ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment