
రెడ్‌క్రాస్‌లో కలెక్టర్ తీరు ఆక్షేపణీయం
నెల్లూరు(అర్బన్): సేవకు మారు పేరుగా ఉన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలక మండలి వ్యవహారంలో కలెక్టర్ ఆనంద్ తీరు ఆక్షేపణీయంగా ఉందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి ఐదుగురు సభ్యులను తొలగించిన కలెక్టర్, అదే టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఎన్నుకునేందుకు కలెక్టర్ ఎలా సహకరించారని నిలదీశారు. తిరిగి చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని, కలెక్టర్ నిర్ణయాన్ని తప్పు పడుతూ కాకాణి మంగళవారం కలెక్టర్‌కు లేఖ రాశారు. రెడ్‌క్రాస్ పాలక మండలి సభ్యుల్లో 15 మందితో జనవరి 8న కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఏడుగురు రాజకీయ పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే వారిలో 7 మంది కాకుండా కేవలం వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు చైర్మన్‌గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, దామిశెట్టి సుధీర్, ఎంవీ సుబ్బారెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డిలను మాత్రమే టార్గెట్ చేసి గత నెల 11న నోటీసులు ఇచ్చిన కలెక్టర్, వారి నుంచి వివరణ తీసుకుని కూడా పదవుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. వైఎస్సార్‌సీపీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ వీరు రెడ్‌క్రాస్‌లో ఎలాంటి రాజకీయ పక్షపాత ధోరణి అవలంభించలేదన్నారు. ఏ పార్టీకి చెందిన వారైన రెడ్‌క్రాస్‌లో పని చేయొచ్చన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ ఎంపీ జాతీయ స్థాయిలో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉన్నారని, మన రాష్ట్రంలో సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కడి రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉన్నారన్నారు. రెడ్‌క్రాస్ ప్రాథమిక సభ్యత్వం కలిగిన వారిలో 80 శాతం మంది ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండేవారన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన వాకాటి విజయకుమార్‌రెడ్డి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మంత్రికి మద్దతుగా కరపత్రాలు ముద్రించి, అందులో తన నంబర్ కూడా ఇచ్చిన వ్యక్తి అని, అటు వంటి వ్యక్తిని చైర్మన్ చేశారన్నారు. కలెక్టర్ సభ్యత్వాలు రద్దు చేసిన ఐదుగురిని తిరిగి పాలక మండలి సభ్యులుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. మిగతా 10 మంది సభ్యులతోనే ఎన్నిక నిర్వహించి నేరుగా టీడీపీ ప్రచారంలో పాల్గొన్న వాకాటి విజయకుమార్‌రెడ్డిని చైర్మన్‌గా, జనార్దన్‌రాజును వైస్ చైర్మన్‌గా ఎన్నుకునేందుకు సహకరించడం దారుణమన్నారు. విజయకుమార్‌రెడ్డి టీడీపీతో అంటకాగిన ఆధారాలను లేఖతో జతచేసి కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్ ఇప్పటికై నా 10 మంది సభ్యులతో ఎన్నికై న వాకాటి విజయకుమార్‌రెడ్డి చైర్మన్ పదవిని రద్దు చేయాలని కోరారు. కోర్టు తీర్పును అనుసరించి తిరిగి 15 మంది సభ్యులతో ఎన్నికలు నిర్వహించాలని, తద్వారా పక్షపాత ధోరణిని వదిలి పారదర్శకతను పాటించాలని కోరారు.
అధికార పార్టీకి వంత
పాడుతున్న కలెక్టర్
తిరిగి చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment