మధ్యాహ్న భోజన పథకంపై ఎంఈఓ విచారణ
● హెచ్‌ఎంకు మెమో,
నిర్వాహకురాలికి నోటీసు
ఆత్మకూరు: పట్టణంలోని ఏసీఎస్‌ఆర్‌కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని ఫిర్యాదులు రావడం, పత్రికల్లో కథనాలు రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఎంఈఓ జ్యోతి మంగళవారం పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, విచారణ చేపట్టారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఎంఈఓ ఆహార పదార్థాలను రుచి చూశారు. విద్యార్థులను భోజన నాణ్యతపై నిర్భయంగా చెప్పాలని కోరడంతో కొందరు ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు. హెచ్‌ఎం హజరత్తయ్య, ఉపాధ్యాయురాలు కె.సుజాతను ఎంఈఓ విచారించారు. పాఠశాల విద్యా కమిటీ సభ్యులను, కొందరు విద్యార్థుల తల్లులతోనూ ఎంఈఓ జ్యోతి విడివిడిగా మాట్లాడారు. పథకం నిర్వాహకురాలికి నోటీసు ఇచ్చినట్లు మరోసారి ఇలా జరగకుండా విద్యార్థులకు చక్కని భోజనం పెట్టాలని హెచ్చరించినట్లు తెలిపారు. హెచ్‌ఎంకు మెమో ఇచ్చినట్లు ఎంఈఓ జ్యోతి వివరించారు. ఈ మేరకు నివేదికను డీఈఓకు పంపనున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment