
ముక్కు మూసుకోవాల్సిందే
నగరంలో అపరిశుభ్రత కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్డుపై చెత్తాచెదారం కనిపిస్తోంది. రోడ్లపై రాకపోకలు సాగించాలంటే దుర్గంధం భరించలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి తప్పడం లేదు. పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో నగరం కంపు కొడుతోంది. గతంలో ప్రతి రోజు చెత్త తీసుకెళ్తే.. ఇప్పుడు వారంలో రెండు రోజులు కూడా వచ్చి తీసుకెళ్లడం లేదు. ఇళ్లలో చెత్త పెట్టుకుంటే కంపుకొడుతోంది. బయట వేద్దామంటూ జరిమానా అంటూ బెదిరిస్తున్నారు.
– సుబ్బారెడ్డి, నగర వాసి
అంటువ్యాధులు ప్రబలుతున్నాయి
ఏ వీధిలో చూసినా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. చెత్తాచెదారం రోడ్డుపైనే పడేయడం, వాటిని తొలగించకపోవడంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించి రోడ్లపై ఎక్కడా కూడా చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటే నగరం పరిశభ్రంగా ఉంటుంది. వ్యాధులు కూడా ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. చెత్త తొలగింపులో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
– ప్రసాద్‌రెడ్డి, నెల్లూరు నగర వాసి

ముక్కు మూసుకోవాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment