ముందస్తు సర్జరీలతో మెనోపాజ్
నెల్లూరు(అర్బన్): చిన్న వయస్సులోనే ఆపరేషన్లు చేసి గర్భ సంచులను తొలగించడం ద్వారా మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఢిల్లీకి చెందిన ఇండియన్ మెనోపాజ్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అంజూసోనీ పేర్కొన్నారు. మెడికవర్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో నూతనంగా ఏర్పడిన నెల్లూరు మెనోపాజల్ సొసైటీని నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. చిన్న అనారోగ్య కారణాలతో 30 ఏళ్లకే గర్భసంచిని తొలగించడం దారుణమని, దీంతో ముందస్తుగా మెనోపాజ్‌కు మహిళలు గురవుతున్నారని చెప్పారు. అనంతరం పలు రకాల కేన్సర్ వ్యాధులు, నివారణ తదితరాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. మెడికవర్ సెంటర్ హెడ్ బిందురెడ్డి, డాక్టర్లు రమేష్‌బాబు, రంగరామన్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
జిల్లాలోని 100కుపైగా మహిళా డాక్టర్లు సభ్యులుగా నెల్లూరు మెనోపాజల్ సొసైటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షురాలిగా పల్లంరెడ్డి యశోధర, కార్యదర్శిగా ఉషారాణి, నెల్లూరు అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులుగా సుప్రజ, లలితషిర్డీశాను ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment