● పరిహారం చెల్లించలేదంటూ
వ్యక్తి వినూత్న నిరసన
ఆత్మకూరు: పట్టణ పరిధిలోని రెండో వార్డులో గల నరసాపురంలో తన స్థలంలో సిమెంట్ రోడ్డును నిర్మించి, దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించలేదంటూ రోడ్డుపై అడ్డంగా గోడను ఓ వ్యక్తి నిర్మించారు. నరసాపురానికి చెందిన అల్లంపాటి మాధవరెడ్డి వలంటీర్‌గా పనిచేసేవారు. అతని ఇంటి దగ్గర సిమెంట్ రోడ్డును నాలుగేళ్ల క్రితం నిర్మించారు. తన స్థలంలో సైతం నిర్మించారని, దీంతో ఉమ్మడి ఆస్తి పంపకాల్లో తమ బంధువుల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. నష్టపరిహారాన్ని సైతం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ప్రయోజనం లభించలేదని, ఈ కారణంగానే సిమెంట్ రోడ్డు నిర్మించిన ప్రాంతంలో గోడను ఏర్పాటు చేశానని వివరించారు. మరోవైపు దారి మూసేయడమేమింటూ పలువురు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న కమిషనర్ గంగా ప్రసాద్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గోడను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment