పూలే దంపతుల విగ్రహావిష్కరణ
నెల్లూరు (టౌన్): నగరంలోని పప్పులవీధిలో ఉన్న వీవీఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో బండారు ఈశ్వరమ్మ పొదుపు గ్రూపు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పూలే దంపతుల విగ్రహాలను ఆదివారం హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొంగూరు నారాయణ ఆవిష్కరించారు. గవర్నర్ దత్తాత్రేయను మంత్రి నారాయణ ఘనంగా సత్కరించారు. గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వారి ఆదర్శాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్‌అజీజ్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆర్డీఓ అనూష, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
మనీ స్కాం నిర్వాహకులను కఠినంగా శిక్షించాలి
కావలి: పట్టణంలోని ముసునూరులో అనంతార్థ అసోసియేట్స్ ఏర్పాటు చేసిస్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కావలిలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) నాయకులు బలిజేపల్లి వేంకటేశ్వర్లు, కె నాగరాజు, దమ్ము దర్గాబాబు, పసుపులేటి పెంచలయ్య, లక్ష్మీరెడ్డి, కరవది భాస్కర్, మల్లి అంకయ్య, చిట్టిబాబు, చేవూరి కొండయ్య తదితరులు మాట్లాడారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని, మనీ స్కాంలో నష్టపోయిన బాధితులకు వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మనీ స్కాంలో ఏజెంట్లుగా ఉండి, అండగా నిలిచిన ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2024 ఆగస్టులోనే మనీ స్కాంపై పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ పోలీసులు దృష్టి సారించలేదన్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ తరహా నేరాలకు పాల్పడిన వ్యక్తికి కావలిలో పోలీసు అధికారులు కొమ్ము కాయడం అత్యంత విచారకరమన్నారు.
ఆజాద్ సెంటర్‌లో
పోలీసు పికెట్
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరం ఆజాద్ సెంటర్‌లో శనివారం అర్ధరాత్రి స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటు చేయడంతో రెండు వర్గాల నడుమ వివాదానికి దారి తీసింది. అక్కడ ఆ రెండు వర్గాలు మోహరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ పి.సింధుప్రియ నేతృత్వంలో పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆజాద్‌సెంటర్ వైపు వెళ్లే అన్నీ రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించారు. దుకాణాలన్ని మూయించివేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఆదివారం నిర్మానుష్యంగా మారింది.
పూలే దంపతుల విగ్రహావిష్కరణ
పూలే దంపతుల విగ్రహావిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment