అతిగా ప్రవర్తించే వారి లెక్కలు తేలుస్తాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు : మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావడం ఖామని, కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో అతిగా ప్రవర్తించే వారి లెక్కలు తేలుస్తామని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బిరదవోలులో శనివారం రాత్రి కాకాణి పర్యటించారు. ఆయన్ను పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. అక్రమ కేసులు పెట్టి తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి లెక్కలు రాసుకుంటామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు నడవాలని సూచించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముత్యాలపేట గ్రామ నాయకుడు కండే రమణయ్య సోదరుడు కండే వెంకటేశ్వర్లు కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కాకాణి వెంట బిరదవోలు ఎంపీటీసీ రావుల దశరథరామయ్యగౌడ్, నాయకులు వెన్నపూస దయాకర్‌రెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వెంకటశేషయ్య, వెన్నపూస యానాదిరెడ్డి, మాలపాటి రమణారెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి, ఆకుల గంగిరెడ్డి ఉన్నారు.
రోడ్లపై సాగునీరు
సాగునీటి కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల సాఫీగా సాగాల్సిన సాగునీరు రోడ్లపై ప్రవహరించి రోడ్లు దెబ్బతింటున్నాయని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. సోమిరెడ్డి ధన దాహానికి సాగునీటి కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల కాలువలు పొంగుతున్నాయని విమర్శించారు. కాలువ నీరు ఉబికి రోడ్లపైకి రావడమే కాక పొలాల్లోకి వెళ్లడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పొదలకూరు మండలం నందివాయ–అమ్మవారిపాళెం గ్రామాల మధ్య సాగునీరు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది తప్పడం లేదన్నారు. పరిస్థితిని గమనించిన స్థానిక రైతులు సొంత నిధులతో నీరు రోడ్లపైకి రాకుండా కట్టలు పోసుకుంటున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment