
వీఎస్‌యూ వైస్ చాన్సలర్‌గా అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ నూతన వైస్ చాన్సలర్‌గా అల్లం శ్రీనివాసరావు మంగళవారం నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్ పలు యూనివర్సిటీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు మూడేళ్ల పాటు వీఎస్‌యూ వైస్ చాన్సలర్‌గా కొనసాగుతారు.
ఆడిట్‌పై ప్రత్యేక దృష్టి
● ఎస్‌హెచ్‌జీలు ఆర్థిక ప్రగతి సాధించాలి
● డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి
నెల్లూరు (పొగతోట): జిల్లా, మండల సమాఖ్యలు ఇంటర్నల్ ఆడిట్ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఖర్చులు, ఆదాయాల విషయాల్లో లోటుపాట్లు ఉండకూడదని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. మంగళవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య సమావేశంలో పీడీ మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఉల్లాస్, సూర్యఘర్ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా చేస్తున్న ఉత్పత్తులను మార్కెటింగ్ కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఉత్పత్తులకు సంబంధించి ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ జరిగేలా విక్రయాలపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డీపీఎం కామాక్షి, రవికుమార్, సూరిబాబు, వెంకటేశ్వర్లు, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
వరికుంటపాడు: మండలంలోని తోటలచెరువుపల్లెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పులి వెంకటప్రసాద్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మౌలాలి, అతని కుమారుడు మరో ముగ్గురు కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం మేరకు.. వెంకటప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ విషయాలు మాట్లాడుకుంటుండగా దొడ్ల మౌలాలి మద్యం తాగి వచ్చి నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ఉదయం ప్రసాద్ బస్టాండ్ సెంటరుకు వెళ్లి తిరిగి వస్తుండగా మౌలాలి మరి కొంత మందితో కలిసి మరోసారి దాడి చేసి గాయపరిచారు. రాత్రి ఫిర్యాదు చేసేందుకు వరికుంటపాడు స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు తీసుకోలేదని, మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఎస్‌ఐ రఘునాథ్‌ను వివరణ కోరగా ప్రసాద్ కుటుంబ సభ్యులు టీడీపీని విమర్శిస్తూ తనపై దాడి చేశారని మౌలాలి ఫిర్యాదు చేేశాడన్నారు. మంగళవారం ఉదయం ప్రసాద్‌పై మౌలాలి మరికొంత మంది తనపై దాడి చేశారని ప్రసాద్ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు ఇద్దరి ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వీఎస్‌యూ వైస్ చాన్సలర్‌గా అల్లం శ్రీనివాసరావు

వీఎస్‌యూ వైస్ చాన్సలర్‌గా అల్లం శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment