పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్ట్‌నర్‌షిప్‌తో నిర్వహించేదే పీ – 4 సర్వే. దీన్ని విశ్వసించాలని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు.. మండలాల్లో ఎంపీడీఓలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. జిల్లాలోని 927 సచివాలయాల పరిధిలో 13,35,459 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఇంటి వద్దకు సిబ్బంది వెళ్లి వివిధ సమాచారాన్ని సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని.. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందనే అంశాన్ని ప్రజలకు తెలియజేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, ఇందులో ఎలాంటి అపోహలొద్దని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో అంతా అయోమయం నెలకొంది.
కావలి: సూపర్ సిక్స్.. ఈ నినాదాన్ని గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచార సభల్లో తరచూ ఉచ్ఛరించేవారు. వీటిని అమలు చేస్తే తమ జీవితాలు మెరుగుపడతాయనే ఆశతో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. తీరా అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర నెలలవుతున్నా, వీటి అమలును విస్మరించిన ప్రభుత్వం.. తాజాగా పీ – 4 సర్వే పేరిట ఉన్న వాటిని కొల్లగొట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఫోన్.. టీవీ.. ఏసీ.. ఇతర గృహోపకరణాలు.. బైక్‌లున్నాయా.. ఇళ్ల స్వరూపం... రేకులా, స్లాబా.. బ్యాంక్ అకౌంట్.. ఇలా 27 రకాల ప్రశ్నల్ని సంధించి, సమాధానాలను సిబ్బంది నింపాల్సిన పరిస్థితి. ఆపై ప్రజల ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి ప్రక్రియను ముగిస్తున్నారు.
ఏసీ ఉన్నా లక్షాధికారులేనా..?
జిల్లాలో 7,33,520 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. వీటి కోసం మరో 1,45,438 ఫ్యామిలీలు ఎదురుచూస్తున్నాయి. వీరందరూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలుగానే పరిగణించాలి. అప్పో సొప్పో చేసో.. నెలవారీ వాయిదాలతోనో.. లేక ఎవరైనా కానుకగా ఇస్తే వారి ఇళ్లలో ఏసీలను ఎక్కువ మంది ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇది ఉందని తెలిస్తే చాలు వెంటనే సదరు వివరాలను ప్రభుత్వ రికార్డుల్లోకి సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఈ వ్యవ హారంతో తమకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన పేదల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment