సజావుగా పింఛన్లు అందజేయాలి
నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా జరపాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యాలయం నుంచి మండలాధికారులతో గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3,07,232 మంది లబ్ధిదారులకు రూ.132 కోట్లను శనివారం ఉదయం నుంచే పంపిణీ చేయాలని సూచించారు. సచివాలయాల వారీగా బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసి సిబ్బందికి సకాలంలో అందజేయాలన్నారు. కిచెన్ గార్డెన్ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళలకు అవగాహన కల్పించి ఇంటి చుట్టుపక్కల ఉండే స్థలాలు, ఇంటి పైభాగంలో కుండీలను ఏర్పాటు చేసి కూరగాయల మొక్కలను సాగు చేసేలా చూడాలని సూచించారు.
అప్పులపాలై.. ఆపై దొంగలై
● మహిళ కళ్లలో కారం కొట్టి
బంగారు సరుడు అపహరణ
● పోలీసులకు ఇద్దరు మహిళల అప్పగింత
● వైద్యశాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా విధులు..!
కోవూరు: ఇంటి ముందు మనవడ్ని ఆడిస్తున్న ఓ మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు చైన్‌ను ఇద్దరు మహిళలు తెంపుకెళ్లిన ఘటన పట్టణంలోని పాటూరు రోడ్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. స్థానికంగా నివాసం ఉంటున్న అత్తిపల్లి సతీష్‌కుమారి తన మనవడ్ని ఇంటి ముందు రోడ్డుపై ఆడించసాగారు. ఈ తరుణంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళలు.. వీధిలో ఏమైనా ఇళ్లు ఖాళీగా ఉన్నాయానని అడిగారు. సమాధానం చెప్తున్న సమయంలో నీరు కావాలని స్కూటీ నడుపుతున్న మహిళ కోరారు. ఈలోపు వెనుక కూర్చున్న మహిళ తన వెంట తెచ్చుకున్న కారంపొడిని ఆమె కళ్లలో కొట్టారు. ఆమె మెడలోని రెండున్నర సవర్ల బంగారు సరుడును తెంపుకొని పరారయ్యేందుకు యత్నించారు. బాధితురాలు కేకలేయడంతో చుట్టుపక్కల వారు, ఆమె కుమారుడు అనూప్‌రెడ్డి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దార్ల జీవిత యల్లాయపాళెం పీహెచ్‌సీలో.. వాసుకి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారనే అంశం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీఎల్‌లో బెట్టింగులు పెట్టి వీరిద్దరూ రూ.30 లక్షల మేర అప్పులపాలయ్యారని తెలిసింది. మెయిన్‌బజార్‌లో బురఖా కొనుక్కొని స్కూటీపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని వెల్లడైంది. కోవూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment