శిశు ఆధార్‌ను నమోదు చేయాలి
నెల్లూరు(అర్బన్): బిడ్డ పుట్టిన వెంటనే శిశు ఆధార్‌ను నమోదు చేయించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉప సంచాలకుడు శ్రీనివాసరెడ్డి సూచించారు. విజయవాడ నుంచి నెల్లూరొచ్చిన ఆయన డీఎంహెచ్‌ఓ సుజాతతో పాటు ఇతర అధికారులతో సమీక్ష సమావేశాన్ని నగరంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శిశు ఆధార్‌తో పాటు జనన ధ్రువీకరణ పత్రాలను సకాలంలో పొందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. టీకాలేయడం, ఫీవర్ సర్వే, ఎన్సీడీ, మలేరియా, కుష్టు, టీబీ తదితర సర్వేలు, వ్యాధుల నియంత్రణలో నూరు శాతం ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని కోరారు. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్‌లో అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ స్టాటిస్టికల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిశు ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ సిద్ధానాయక్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. డెమో అధికారి కనకరత్నం, స్టాటిస్టికల్ ఆఫీసర్ సహన, డిప్యూటీ ఎస్‌ఓ మల్లికార్జున, డీపీహెచ్‌ఎన్‌ఓ మంజుల, డీపీఓ రమేష్, ఏఎస్‌ఓలు రమేష్, మణికంఠ, డీపీఏ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment