కుమారుల్ని స్వదేశానికి రప్పించాలంటూ..
ఏజెంట్ మోసంతో మా పిల్లలు మలేసియా జైల్లో చిక్కుకున్నారని, వారిని స్వదేశానికి రప్పించాలని రాపూరు మండలం తెగచర్లకు చెందిన కరిపం జయమ్మ, పెద్దయ్య కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామానికి చెందిన కరిపం సింహాద్రి, పవన్ పదినెలల క్రితం చైన్నెలోని ఓ ఏజెంట్ ద్వారా మలేసియాలోని హో టల్లో పనినిమిత్తం వెళ్లారు. ఏజెంట్ వర్క్ పర్మిట్ అని చెప్పడంతో నమ్మి మోసపోయారు. మూడు నెలల క్రితం వర్క్ పర్మిట్ లేదని, అది కేవలం టూరిజం వీసా అని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీనిపై ఏజెంట్‌ను సంప్రదించగా అతను సరిగా సమాధానం ఇవ్వట్లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఎలాగైనా వారిని ఇండియాకు రప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment