
ప్రతి వారం వెల్లువలా అర్జీలు
● ఈ సోమవారం సంఖ్య 436
● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నెల్లూరు రూరల్: అర్జీల సంఖ్య తగ్గడం లేదు. మండలాల్లోని కొందరు అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు జిల్లా కేంద్రం బాట పడుతూనే ఉన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, అధికారులు వినతులు స్వీకరించారు. ఈసారి కూడా రికార్డు స్థాయిలో 436 అర్జీలను ప్రజలు అందజేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 169, పోలీస్ శాఖవి 61, మున్సిపల్ శాఖవి 36, సర్వేవి 36, పంచాయతీరాజ్ శాఖవి 34, విద్యుత్ శాఖవి 9 తదితర శాఖలకు సంబంధించి అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి వినతులు ఎక్కువగా వస్తున్నాయని వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment