
ఫిర్యాదుల్లో కొన్ని..
● నెల్లూరు బారకాస్ సెంటర్‌కు చెందిన సునీల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. సినిమా రంగంలో అడుగులు వేయాలంటే ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని నమ్మించాడు. అక్కడకు తీసుకెళ్లి మత్తుపానీయాలిచ్చి లైంగికదాడి చేశాడు. అసభ్యకర ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి నగదు తీసుకున్నాడు. ఇంకా కావాలంటూ దాడి చేయడమే కాకుండా నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని దర్గామిట్టకు చెందిన ఓ యువతి కోరారు.
● హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నానని పొదలకూరుకు చెందిన సునీల్ అనే వ్యక్తి నమ్మించాడు. నా కుమారుడికి అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.43 లక్షలు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా జాబ్ ఇప్పించలేదు. నగదు తిరిగివ్వాలని కోరగా పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయాలని పొదలకూరుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● నా ఆర్థిక అవసరాల నిమిత్తం రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. అక్కడి కాంట్రాక్టర్ రమేష్ కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. నిరాకరించడంతో కోపంతో నాపై దాడిచేసి అవమానకరంగా మాట్లాడాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని తోటపల్లిగూడూరు మండలానికి చెందిన ఓ మహిళ కోరారు.
● నా భర్త మద్యం వ్యసనానికి బానిసై నన్ను, పిల్లలను పట్టించుకోవడం లేదు. మద్యం మత్తులో మమ్మల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● నెల్లూరు రూరల్ మండలానికి చెందిన శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి నాకు ప్లాట్‌ను విక్రయించాడు. అందులో నిర్మాణ పనులు చేపడుతుండగా ఆ స్థలం తమదని కొందరు అడ్డుకున్నారు. విచారించగా డబుల్ రిజిస్ట్రేషన్ అని తేలింది. విచారించి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment