
‘నా కుమారుడు దౌర్జన్యం చేస్తున్నాడు’
నెల్లూరు(క్రైమ్): ‘వృద్ధాప్యంలో ఉన్న నన్ను బాగా చూసుకుంటానని చిన్న కుమారుడు నమ్మించాడు. నా పేరు మీద ఉన్న ఇంటిని తన పేరుపై రాయించుకుని పట్టించుకోవడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నాడు. విచారించి న్యాయం చేయండి’ అంటూ తోటపల్లిగూడూరు మండలానికి చెందిన ఓ వృద్ధుడు పోలీసులను కోరాడు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 85 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు అందజేశారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర, ఎస్‌బీ డీఎస్పీలు పి.సింధుప్రియ, ఎ.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు
సినిమాల్లో అవకాశం పేరుతో
లైంగికదాడి
ఓ యువతి ఆవేదన
నెల్లూరులో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
Comments
Please login to add a commentAdd a comment