
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం..
ఆప్కాస్‌ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అప్పగించేందుకు యత్నించడం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమల్లి శంకర్ కిశోర్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్కాస్‌ను రద్దు చేస్తామని లీకులిస్తున్నారని తెలిపారు. ఒక వ్యవస్థను మార్చాలంటే అంతకంటే మంచి మార్గం చూపాలే తప్ప రద్దు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. దీని వల్ల ప్రైవేట్ ఏజెన్సీలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాయన్నారు. అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment